fbpx
Thursday, April 25, 2024
HomeMovie Newsమహా సముద్రం: సిద్దార్థ్ ఫస్ట్ లుక్

మహా సముద్రం: సిద్దార్థ్ ఫస్ట్ లుక్

SiddarthFirstLook From MahaaSamudramMovie

టాలీవుడ్: బొమ్మరిల్లు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ సాధించిన నటుడు సిద్దార్థ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ , ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని సంఘటనల వలన మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కనపడలేదు. అడపా దడపా కొన్ని సినిమా డబ్ అయితున్నా కూడా డైరెక్ట్ తెలుగు మూవీ లో నటించలేదు. ప్రస్తుతం ఇపుడు ఒక మల్టీ స్టారర్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ రోజు సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి సిద్దార్థ్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం.

RX100 సినిమా ద్వారా మొదటి సినీమా తోనే బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమా కి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని శర్వానంద్ మరియు సిద్దార్థ్ తో ముల్టీస్టారర్ సినిమాగా రూపొందిస్తున్నాడు. ఒక ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి మరియు అను ఇమ్మాన్యూల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో యంగ్ లుక్ లో సిద్దార్థ్ ఆకట్టుకుంటున్నాడు. మళ్ళీ పాత లవర్ బాయ్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ బ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 19 న ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular