fbpx
Tuesday, April 23, 2024
HomeNationalస్వీయ నిర్బంధంలోకి సౌరవ్ గంగూలీ

స్వీయ నిర్బంధంలోకి సౌరవ్ గంగూలీ

saurav-ganguly-home-quarantine

కోలకతా: భారత క్రికెట్ మాజీ కెప్టెన్, భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ హోం ఐసోలేషన్ కు వెళ్ళారు.

గంగూలీ కి సోదరుడైన స్నేహశీష్ గంగూలీ గత కొన్ని రోజులుగా జ్వరంతో భాధ పడుతున్నారని, బుధవారం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (కాబ్) అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

తాజాగా సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు చాలా మంది కరోనా బారిని పడుతున్నారు. ఎంతో స్వీయ జాగ్రత్తలు పాటించే ఈ సెలబ్రిటీలను సైతం కరోనా విడిచిపెట్టడం లేదు.

బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన స్నేహశీష్ గంగూలీ ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కు సం యుక్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు పాజిటివ్ రావడం వల్ల సౌరవ్ గంగూలీ హోం క్వారంటైన్ కి వెళ్ళారు. ఆయన కొద్ది రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular