fbpx
Thursday, December 5, 2024
HomeMovie Newsసంక్రాంతికి రెడీ అవుతున్న సర్కార్ సీతారాం

సంక్రాంతికి రెడీ అవుతున్న సర్కార్ సీతారాం

SARKAR-SEETARAM-GETTING-READY-FOR-SANKRANTHI
SARKAR-SEETARAM-GETTING-READY-FOR-SANKRANTHI

మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ, బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో రూపొందుతున్న సర్కార్ సీతారాం యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బీకే 109పై భారీ అంచనాలు ఉన్నాయి.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశకు చేరుకుంది.

అభిమానులు సినిమా టైటిల్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దీపావళి సందర్భంగా టీజర్‌తో పాటుగా టైటిల్‌ను ప్రకటించనున్నారు.

సినిమాకు ‘సర్కార్ సీతారాం’ అనే మాస్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ టైటిల్‌ మరింత ఎలివేషన్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.

రాజస్థాన్ నేపథ్యంలో సాగే ఈ కథలో బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, మాస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనుంది.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఊర్వశీ రౌతెలా నటిస్తుండగా, చందినీ చౌదరి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

మరో కీలక ఆకర్షణగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన నటన ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్ అవుతుందని అంటున్నారు.

సంగీతం అందిస్తున్న థమన్ ఇప్పటికే మూడు పాటలను సిద్ధం చేశాడు. సినిమాకు పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందించేందుకు ఇప్పుడు పనిలో నిమగ్నమయ్యాడు.

విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular