fbpx
Tuesday, April 23, 2024
HomeMovie Newsమరో సినిమాని సిద్ధం చేసిన యువ హీరో

మరో సినిమాని సిద్ధం చేసిన యువ హీరో

SantoshShoban LatestMovie Update

టాలీవుడ్: పెద్ద పెద్ద హీరోలు సినిమాలు రూపొందించి విడుదల చేయడానికి తటపటాయిస్తుంటే చిన్న హీరోలు, చిన్న సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతూ మంచి టాక్ కూడా తెచుకుంటున్నాయి. ఇండస్ట్రీ లో ఇప్పుడు ఉన్న చిన్న హీరోల్లో సత్యదేవ్, సంతోష్ శోభన్ ఈ టైం లో వరుస సినిమాతో జోరు చూపిస్తున్నారు. తాను నేను, పేపర్ బాయ్ సినిమాల తర్వాత సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ‘ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యుంటే హీరో కి అంత గుర్తింపు రాకపోయేదేమో. ఓటీటీ లో విడుదల అవడంతో ఈ సినిమా మంచి టాక్ మాత్రమే కాకుండా సంతోష్ శోభన్ కి చాలా ప్లస్ అయింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో బిజీ గా ఉన్నాడు. ఇప్పటికే మారుతీ డైరెక్షన్ లో ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా పూర్తి చేసి సరైన రిలీజ్ టైం కోసం చూస్తున్నాడు.

ఈ టైం లో సైలెంట్ గా మరో ఓటీటీ రిలీజ్ ని కూడా రెడీ చేసాడు. ఈ రోజు ఆ సినిమా అప్ డేట్ ఒకటి విడుదల చేసారు. ఆహ వారు ఓటీటీ కోసమే ‘బేకర్ అండ్ బ్యూటీ’ అనే పేరుతో ఒక సినిమాని రూపొందించారు. సైలెంట్ గా రూపొందించిన ఈ సినిమాని సెప్టెంబర్ 10 నుండి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఆహా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.’ఒక లోకల్ అబ్బాయి లైఫ్ లోకి అతిలోక సుందరి లాంటి అమ్మాయి వస్తే లైఫ్ సెలెబ్రేషన్ అవుతుందా లేక రోలర్ కోస్టర్ రైడ్ అవుతుందా ‘ అని చెప్తూ ఈ సినిమా కి సంబందించిన అప్ డేట్ ని పోస్టర్ రూపంలో విడుదల చేసారు. ఈ సినిమాని సంతోష్ కి జోడీ గా టీనా శిల్పారాజ్ నటిస్తున్నారు. జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular