హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను చర్చలకు దారితీశాయి. ఆమె ప్రకారం, ప్రముఖ హీరో నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. అంతేకాక, కొందరు హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడం, సినిమా రంగం నుంచి దూరం కావడానికి కూడా కేటీఆర్ కారణమని ఆమె ఆరోపించారు. సురేఖ మాట్లాడుతూ, “కేటీఆర్ మదమెక్కి, సినీ తారల జీవితాలతో ఆడుకున్నాడు. డ్రగ్స్ కేసులో ఇరికించి వారికి ఇబ్బందులు కలిగించాడు,” అని విమర్శించారు.
సినిమా పరిశ్రమలో కేటీఆర్ పట్ల ఉన్న నెగిటివ్ ఇమేజ్ ఓపెన్ సీక్రెట్ అని ఆమె అన్నారు. అలాగే, బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు, దీనిని ఉపయోగించుకొని అప్పటి ప్రభుత్వ పెద్దలు, కేటీఆర్ అనేక అరాచకాలకు పాల్పడినట్లు కూడా సురేఖ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు బాపూఘాట్‌లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు.
సోషల్ మీడియా ట్రోలింగ్‌పై సురేఖ ఆవేదన
సమావేశంలో, కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనకు నూలు దండ వేయడం రాజకీయ చర్చకు దారితీశాయి. ఆ ఫోటో ఆధారంగా బీఆర్ఎస్ మద్దతుదారులు తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం వల్ల తీవ్రంగా మనస్తాపం కలిగిందని సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. “ట్రోలింగ్ నన్ను తీవ్రంగా బాధించింది. నా మీద పెట్టిన పోస్టులు నా మనోస్థితిని దెబ్బతీశాయి,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సురేఖ మాట్లాడుతూ, తనపై జరిగిన ట్రోలింగ్‌కు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, కవిత పట్ల ఇలాగే వ్యవహరిస్తే కేటీఆర్ క్షమిస్తాడా అని సురేఖ ప్రశ్నించారు. ఆమెకు న్యాయం చేయాలని, మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం నిలిపివేయాలని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.