fbpx
Thursday, June 8, 2023

INDIA COVID-19 Statistics

44,992,293
Confirmed Cases
Updated on June 8, 2023 10:12 pm
531,886
Deaths
Updated on June 8, 2023 10:12 pm
2,687
ACTIVE CASES
Updated on June 8, 2023 10:12 pm
44,457,720
Recovered
Updated on June 8, 2023 10:12 pm
HomeMovie Newsగోరెటి తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో రేణు దేశాయ్

గోరెటి తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో రేణు దేశాయ్

RenuDeshai MusicSittingsWith GoretiVenkanna

టాలీవుడ్: బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యి తర్వాత పవన్ కళ్యాణ్ భార్య గా రేణు దేశాయ్ అందరికి సుపరిచితమే. మోడల్ నుండి నటి గా మారి కేవలం తెలుగులోనే రెండు సినిమాలు అవి కూడా తన భర్త పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించింది. చాల సంవత్సరాల తర్వాత మరాఠి లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా తన ప్రయాణం ప్రారంభించింది. ఇపుడు తెలుగులో కూడా డైరెక్టర్ గా తొలి అడుగులు వెయ్యబోతుంది. తాను ఇదివరకే వ్యవసాయం పైన, రైతుల పైన ఒక సినిమా చెయ్యబోతున్ననై చెప్పింది. ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టుంది ఈ మాజీ హీరోయిన్.

ఈ సినిమా పాటల కోసం గోరెటి వెంకన్న ని కలిసింది. గోరెటి వెంకన్న పల్లె పాటలు రాయడం లో ప్రసిద్ధి. ఆయనతో తన రైతుల బేస్డ్ సినిమా కోసం పాటలు రాయించుకోవడానికి మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం అతన్ని కలిసి ఆ విశేషాలని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. గోరెటి వెంకన్న ఫామ్ హౌస్ లో సహజ పద్దతిలో కుండలో తన భార్య తయారు చేసిన భోజనం, అరటి ఆకులో భోజనం చేసే విధానం, సింపుల్ లివింగ్ , ఈ వర్షం లో ఆహ్లాదకరమైన వాతావరణం అంటూ కొన్ని ఫోటోలు , వీడియోలు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular