మూవీడెస్క్: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవల షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో చేతికి గాయం కావడంతో, డాక్టర్ల సలహా మేరకు నాలుగు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
గాయం తీవ్రత ఎక్కువగా లేకపోయినా, షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికి రవితేజ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే తాజాగా విడుదలైన ఓ ఫోటోలో రవితేజ చేతికి కట్టు వేసుకొని ఉన్నారు. ఈ ఫోటోని డైరెక్టర్ బాబీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం జరిగింది.
దీంతో అభిమానులు రవితేజ గాయానికి కొంచెం టెన్షన్ పడ్డా, ఫోటో చూసిన తర్వాత ఆయన ఆరోగ్యం గురించి కాస్త ఉపశమనం పొందారు.
‘‘అన్నయ్య విశ్రాంతి తీసుకోండి’’ అంటూ ట్విట్టర్‌లో అభిమానులు సలహాలు ఇస్తున్నారు. అసలైతే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉన్నా, ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక రవితేజ కోలుకున్న అనంతరం మరో కొత్త సినిమాను కూడా స్టార్ట్ చేయనున్నాడు.