మూవీడెస్క్: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న దూసుకుపోతూ వరుస సినిమాలతో బిజీగా ఉంది.
అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప 2తో పాటు, హిందీ చిత్రం ‘చావా’ కూడా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘యానిమల్’ మూవీతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ రష్మికను మరో స్థాయికి తీసుకెళ్లింది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, ఆమె ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటుంది.
ఇదిలా ఉంటే, రష్మిక త్వరలో ఓ హర్రర్ జానర్ సినిమాలో నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ‘వాంపైర్స్ ఆఫ్ విజయనగర’ అనే పేరుతో తెరకెక్కనుందట.
రాజ్‌కుమార్ రావు హీరోగా నటించనున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహిస్తారని టాక్.
14వ శతాబ్దం నుంచి ప్రస్తుత కాలం వరకు జరిగే ఈ కథలో భూతాలు, దెయ్యాలు ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలుస్తోంది.
భారీ బడ్జెట్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. హర్రర్ సినిమాలపై బాలీవుడ్‌లో పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, రష్మిక కొత్త అవతారంలో ఎలా కనిపించనుందో చూడాలి.