మూవీడెస్క్: బాలీవుడ్ లో ప్రస్తుతం అతి భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రత్యేకంగా లాంచ్ చేయకపోయినా, ఈ సినిమా ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
రన్బీర్ కపూర్ ఈ చిత్రంలో రాముడిగా మాత్రమే కాకుండా, పరశురాముడి పాత్రలో కూడా కనిపించనున్నాడు. ఈ ద్విపాత్రాభినయం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారుతుందట.
అమితాబ్ బచ్చన్ జటాయు పాత్రకు వాయిస్ ఇవ్వబోతుండగా, హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.
లక్ష్మణుడి పాత్ర కోసం రవి దూబే ఎంపికయ్యారు. మొత్తం మూడు భాగాలుగా రూపొందించనున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2026లో విడుదల చేయాలనే ప్రయత్నం జరుగుతోంది.
రామసీతల వివాహం, వనవాసం వంటి కీలక ఘట్టాలను మొదటి భాగంలో చూపించబోతున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.