మూవీడెస్క్: రామ్ పోతినేని మల్టీస్టారర్? టాలీవుడ్‌లో నిత్యం కొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తుంటాయి. ఆ క్రమంలో డైరెక్టర్ మహేష్ బాబు పి కూడా తన కొత్త ప్రయత్నం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో నవీన్ పోలిశెట్టి, అనుష్క కాంబినేషన్‌లో ప్రేక్షకులను నవ్వించిన మహేష్ బాబు, ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ కోసం మరీంత కొత్తగా ఆలోచిస్తున్నారు.
ఈసారి ఆయన రూపొందించబోయే మల్టీస్టారర్‌లో యంగ్ హీరో రామ్ పోతినేని, సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి నటించనున్నారని సమాచారం.
ఇటీవల రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే, రామ్ కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.
అటువంటి సమయంలో మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ కొత్త మల్టీస్టారర్ రామ్ కెరీర్‌కు కీలకమైయ్యే అవకాశం ఉంది.
మొన్నటివరకు బాలకృష్ణను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించారని టాక్ వినిపించింది, కానీ బాలయ్య తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆ అవకాశం వదిలేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, సీనియర్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ కథకు ఓకే చెప్పారని సమాచారం. రజనీ, రామ్ కాంబినేషన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది.
ఈ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.