మూవీడెస్క్: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఆగష్టు నెలలో “డబుల్ ఇస్మార్ట్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
అయితే సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రిజల్ట్ తో అతనికి పెద్ద ఆలోచన ఎదురైంది.
గత చిత్రాలు “ది వారియర్” మరియు “స్కంద” తో పోలిస్తే కూడా డబుల్ ఇస్మార్ట్ చాలా ఎక్కువ నష్టాలు కలిగించినట్లు తెలుస్తోంది.
ఈ ఫెయిల్యూర్ తర్వాత, రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ దర్శకుడు మిస్ శెట్టి, మిస్టర్ పిలిశెట్టి సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు.
అయితే సినిమా జోనర్ గురించి ఇంకా స్పష్టత లభించలేదు. మరోవైపు హరీష్ శంకర్ కూడా రామ్ తో సినిమా చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే రీసెంట్ గా అతనికి “మిస్టర్ బచ్చన్” సినిమాతో డిజాస్టర్ అయ్యింది. దీంతో హరీష్ శంకర్‌తో సినిమా చేసే ఆలోచనపై రామ్ పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రామ్ వరుసగా మూడు కమర్షియల్ డిజాస్టర్ల తరువాత, రిస్క్ తీసుకోకుండా సేఫ్ స్క్రిప్ట్ తో పనిచేయాలని భావిస్తున్నాడు.
అందుకే హరీష్ ను పక్కన పెట్టి ముందుగా ఫామ్ లో ఉన్న మహేష్ తో ఒక డిఫరెంట్ సినిమా చేయాలని ఆశిస్తున్నాడు.
ఒకవేళ హరీష్ శంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాతో సక్సెస్ సాధిస్తే, రామ్ పోతినేని మళ్ళీ అతనితో కలిసి సినిమా చేసే అవకాశం ఉండవచ్చు.
మరి హరీష్ పవన్ కళ్యాణ్ తో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.