fbpx
Friday, October 4, 2024
HomeMovie Newsపుష్ప 2 సెట్స్ పై రాజమౌళి – సుకుమార్ ఆనందం

పుష్ప 2 సెట్స్ పై రాజమౌళి – సుకుమార్ ఆనందం

RAJAMOULI-IN-PUSHPA-2-SETS
RAJAMOULI-IN-PUSHPA-2-SETS

మూవీడెస్క్: పుష్ప 2 సెట్స్ పై రాజమౌళి! ఇండియన్ సినీ పరిశ్రమలో దర్శక ధీరుడు రాజమౌళి తన ప్రత్యేకమైన దర్శక శైలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

రాజమౌళి తన సహచర దర్శకులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా, పుష్ప 2 సినిమా సెట్స్‌ వద్దకు వెళ్లిన ఆయన మేకర్స్ ను ప్రత్యేకంగా కలిశారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 షూటింగ్ సెట్‌లోకి రాజమౌళి సడన్ గా రావడంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు.

ఈ సందర్భంగా సుకుమార్, బాహుబలి డైరెక్టర్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రాజమౌళి గారిని మా సెట్స్ లో కలవడం గొప్ప అనుభవం. ఆయన రావడం మా టీమ్ కి ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది” అంటూ సుకుమార్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ ఫోటోను చూసి అభిమానులు మరింత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఈ సందర్బంగా, మహేష్ బాబు అభిమానులు రాజమౌళిని తన తదుపరి చిత్రం SSMB29 గురించి అప్డేట్ ఇవ్వమని అడిగారు.

అయితే, రాజమౌళి సరైన సమయానికి అప్డేట్ ఇస్తానంటూ అభిమానులకు సమాధానం ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular