మూవీడెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
లేడీ అసిస్టెంట్ అతడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ కేసు నేపథ్యంలో పలు పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. పుష్ప -2 మూవీ సెట్స్‌లో ఈ ఘటన జరిగినట్లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ లు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చడానికి యూట్యూబ్ ఛానెళ్లలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పుష్ప -2 మూవీ నిర్మాత రవిశంకర్, మత్తు వదలరా -2 ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
జానీ మాస్టర్ వివాదానికి పుష్ప సెట్స్‌తో, చిత్ర యూనిట్‌తో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా వ్యక్తిగత సమస్య అని అన్నారు.
అలాగే బాధితురాలు పుష్ప -2 కోసం కొరియోగ్రాఫర్‌గా ఎంపికయ్యారని, కొన్ని పాటల పని మిగిలుందని చెప్పారు.
యూట్యూబ్ లో వస్తున్న తప్పుడు ప్రచారంపై మండిపడుతూ, సెన్సేషన్ కోసం చేసే ఇలాంటి ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.