మూవీడెస్క్: డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 1000 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిపినట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
పుష్ప 2 ప్రమోషన్స్ కోసం నిర్మాతలు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఆల్ ఇండియా స్థాయిలో బన్నీ పలు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు.
ముఖ్యంగా నార్త్ ఇండియాలో విస్తృత ప్రచారానికి సిద్దమవుతున్నారు.
ఐదు ప్రధాన రాష్ట్రాలలో ఐదు మెగా ఈవెంట్స్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు, పంజాబ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలలో కూడా ఈవెంట్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్ కెరీర్ లో ‘పుష్ప 2’ అత్యంత ప్రెస్టీజియస్ మూవీ. 1000 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరాలనే లక్ష్యంతో ఉన్నారు.
సుకుమార్ మూడేళ్ల కష్టానికి బన్నీ ఇచ్చిన అవుట్ ఫుట్ అదిరిపోయేలా ఉందని టాక్.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ట్రెండ్ సెట్ చేయబోతుందనే అంటున్నారు.