మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా ‘పుష్ప 1’ హిందీ లోనూ సూపర్ హిట్ అవ్వడంతో ‘పుష్ప 2’ కు నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.
ట్రేడ్ వర్గాలు ఈ సినిమాను ఫస్ట్ డే వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించేలా ఉందని భావిస్తున్నాయి.
ఈ చిత్రం విడుదలకు ముందే బాలీవుడ్‌లో ఉన్న ‘సింగం అగైన్’, ‘భూల్ భూలయ్యా 3’ వంటి సినిమాలపై పుష్ప 2 ప్రభావం తప్పదని అంటున్నారు.
‘సింగం అగైన్’ డిసెంబర్ 1న విడుదల కానుండగా, ‘భూల్ భూలయ్యా 3’ కూడా అదే రోజు విడుదల కానుంది.
ఈ రెండు సినిమాల విడుదల ఐదు రోజుల తరువాత ‘పుష్ప 2’ విడుదల అవ్వడంతో థియేటర్లలో పోటీ తీవ్రంగా ఉండనుంది.
‘పుష్ప 2’ ప్రభావం వీటిపై పడటం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘భూల్ భూలయ్యా 3’ చిత్రం డిస్టిబ్యూటర్లు ‘పుష్ప 2’ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది.