మూవీడెస్క్: జూనియర్ ఎన్టీఆర్ నటనా ప్రతిభ గురించి ఇప్పటి వరకు ఎంతోమంది మాట్లాడారు. అయితే తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు అభిమానులను ఎంతో ఆనందానికి గురి చేశాయి.
“తెలుగులో నాకు అత్యంత ఇష్టమైన నటుడు తారక్” అంటూ దేవర సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన తన మనసులో మాట చెప్పారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, “తారక్‌పై నాకు ఉన్న ప్రేమ గురించి ఎవరూ తెలుసుకోలేదు, తారక్ కూడా కాదు.
ఆ మధ్య ఆస్కార్ వేడుకలకు వెళ్ళినప్పుడు తారక్ మిగిలినవాళ్ల ముందు నిలబడి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు, వీడియో చూస్తూ ఎంతో గర్వించాను” అన్నారు.
తెలుగు సినిమాలలో తనకు ఇష్టమైన హీరోల్లో అత్యుత్తమ నటుడు ఎన్టీఆర్ అని చెప్పారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తారక్‌ను ప్రశంసించారు.
“తారక్ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చుకుంటాడు” అని ఆశాభావం వ్యక్తం చేశారు.