మూవీడెస్క్: డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యున్నత స్థాయి మార్కెట్ వాల్యూ కలిగిన స్టార్.
తన తాజా చిత్రం కల్కి 2898ఏడీ తో 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు అందుకున్న హీరోగా నిలిచాడు.
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూ, తన మార్కెట్ విలువను ఇంకా పెంచుకుంటున్నాడు.
ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ, తన డైరెక్టర్స్‌కి పూర్తి స్వేచ్ఛను ఇచ్చే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చే విషయంలో ప్రభాస్ ఏ దర్శకుడినైనా ఒకే రీతిలో ప్రోత్సహిస్తున్నాడు. అగ్ర దర్శకులతో పాటు యంగ్ డైరెక్టర్స్‌కి కూడా ఒకే విధంగా ప్రాధాన్యం ఇవ్వడం, ప్రస్తుత ఫిల్మ్ మేకింగ్ లో అతని ప్రత్యేకతగా నిలుస్తోంది.
ప్రభాస్ లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరించేలా మేకర్స్ కు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల, షూటింగ్ వేగంగా పూర్తవ్వడం, అలాగే దర్శకులకు మెరుగైన అవుట్‌పుట్ తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందనే నమ్మకం ప్రభాస్‌లో ఉంది.
హను రాఘవపూడి ఫౌజీ చిత్రంలో, అలాగే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్రంలో ఇదే పని కొనసాగుతోంది.
ఈ విధంగా దర్శకులకు పూర్తి క్రియేటివ్ స్వేచ్ఛ ఇవ్వడం వలన, ప్రభాస్ సినిమాలు మరింత వేగంగా కంప్లీట్ అవ్వడంతో పాటు, సినిమా క్వాలిటీ విషయంలో కూడా పాజిటివ్ ఫలితాలు వస్తాయని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.