fbpx
Friday, October 4, 2024
HomeMovie Newsప్రభాస్.. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రేమ కథ

ప్రభాస్.. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రేమ కథ

PRABHAS-COMING-WITH-LOVE-STORY-WITH-3-HEROINES
PRABHAS-COMING-WITH-LOVE-STORY-WITH-3-HEROINES

మూవీడెస్క్: డార్లింగ్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ “ది రాజాసాబ్” సినిమా హర్రర్ కామెడీ జోనర్ లో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో మరొక వైవిధ్యమైన ప్రయోగంగా నిలవనుంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ప్రభాస్ కు ముగ్గురు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ జోడీగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ మధ్య వచ్చే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

దర్శకుడు మారుతి ఈ సినిమాను వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సగం పూర్తయింది.

మిగిలిన టాకీ పార్ట్, సాంగ్స్ కూడా త్వరగా పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ అందించే పాటలు, డాన్స్ నెంబర్స్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించిందని సమాచారం.

దర్శకుడు మారుతి ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమాతో ఓ కొత్త కోణాన్ని చూపించనున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular