మూవీడెస్క్: ఇటీవల పూజా హెగ్డే గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కాంచన-4’ సినిమాలో ఆమె నటించనున్నారని, దెయ్యం నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో పూజ ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఇది వినగానే, పూజా అభిమానులు కాస్త షాక్ అయ్యారు. తెలుగులో పూజా హెగ్డే ‘అలా వైకుంఠపురం’ వంటి హిట్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
కానీ ఇటీవల ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేకపోయాయి. దీంతో, సౌత్‌లో ఆమెకు అవకాశాలు తగ్గాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అటు బాలీవుడ్‌లో కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు సౌత్‌లో మళ్లీ హిట్ కొట్టేందుకు పూజా కొత్త ప్రయత్నం చేస్తోందా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
కాంచన-4 లో పూజ నటిస్తుందా లేదా అనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చిన కాంచన సీరీస్ మూవీస్ అన్ని కూడా బిగ్ హిట్స్ గా నిలిచాయి.
ఇప్పుడు 4వ భాగం ఉంటుందని క్లారిటీ వచ్చింది. మరి లారెన్స్ ఎలాంటి క్యాస్టింగ్ తో వస్తాడో చూడాలి.