న్యూఢిల్లీ: ఇటీవలే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో దేశంలోని వాహనదారులపై పెట్రో, డీజిల్ బాదుడు మొదలయ్యింది. చివరగా డీజిల్,పెట్రోల్ ధరలు గత ఏడాది నవంబర్ 4వ తేదీ వరకు పెరిగాయి.
కాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇన్నాళ్ళు వేచి చూసిన చమురు కంపెనీలు ఇప్పుడు మళ్లీ పెట్రోల్ ధరల పెంపును ప్రారంభించాయి. దీని వల్ల తాజాగా బుధవారం లీటర్ పెట్రోల్‌పై 90పైసలు మరియు డీజిల్‌పై 84పైసలు పెఓచేశాయి.
ఇంకో వైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా గరిష్టానికి చేరాయి. దీనితో క్రమంగా చమురు సంస్థలు నష్టాలు పెరుగుతుండడంతో ఇప్పుడు పెట్రో ధరల పెంపు అనివార్యమైందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు ప్రముఖ నగరాల వారీగా:
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధరూ.110గా ఉండగా డీజిల్ ధర రూ.96.36 పైసలుగా ఉంది.
గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.112.08 ఉండగా డీజిల్ ధర రూ.98.10పైసలుగా ఉంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.99 ఉండగా డీజిల్ ధర రూ.97.90పైసలుగా ఉంది.
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.21 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.87.47పైసలుగా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.82పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00పైసలుగా ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.51 ఉండగా డీజిల్ ధర రూ.90.62పైసలుగా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.16 ఉండగా డీజిల్ ధర రూ.92.19పైసలుగా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.42 ఉండగా డీజిల్ ధర రూ.85.80పైసలుగా ఉంది.