మూవీడెస్క్: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, సినీ ప్రాజెక్టులకు కూడా సమయం కేటాయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఆయన చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు షూటింగ్ కోసం వేచి చూస్తున్నాయి. వాటిలో ‘ఓజీ’ చిత్రాన్ని మొదట పూర్తి చేయాలని పవన్ నిర్ణయించారని, ఈ సినిమా కోసం దర్శకుడు సుజిత్ పక్కా ప్లాన్ సిద్ధం చేసారట.
ఈ చిత్రంలో పవన్ పాత్ర విజయవాడకు లింక్ ఉన్న కేరెక్టర్ కావడంతో, షూటింగ్ కొంత భాగం అక్కడే జరగనుంది.
ముంబై నేపథ్యంతో సాగుతున్నప్పటికీ, కీలక సన్నివేశాలను విజయవాడలోనే పూర్తి చేయాలని టీమ్ నిర్ణయించింది.
ముఖ్యంగా పవన్ అందుబాటులో ఉండేలా ఆ ప్రాంతంలో అన్ని సెట్స్ ను ఏర్పాటు చేస్తూ, కొంత అవుట్ డోర్ షూటింగ్ పైనే ఫోకస్ పెట్టారు.
అలాగే హైదరాబాద్ లో గ్రీన్ మ్యాట్ టెక్నాలజీని సుజిత్ సమర్ధంగా ఉపయోగించి, సినిమాకి కావాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు.
దీంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ పైన దృష్టి పెట్టాలని యూనిట్ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక్క వారంలో రెండు రోజుల షూటింగ్ డేట్స్ మాత్రమే కేటాయిస్తానని చెప్పడంతో, ఈ షెడ్యూల్ కోసం టీమ్ ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తోంది.
షూట్ పూర్తయిన వెంటనే, పవన్ హరిహర వీరమల్లు కోసం డేట్స్ ఇస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.