పారిస్: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ కు రెండవ రోజు అత్యంత విజయవంతమైన రోజు గా నిలిచింది. భారత దేశం మొత్తం నాలుగు పతకాలను గెలుచుకుంది.
2వ రోజు షూటింగ్ లో మూడు పతకాలు, మరియు అథ్లెటిక్స్ లో ఒక పతకం భారత్ ఖాతాలో చేరాయి.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ష్1 ఫైనల్ లో అవని లేఖరా స్వర్ణ పతకం సాధించగా, మోనా అగర్వాల్ కాంస్య పతకంతో మెరిసింది.
అవని లేఖరా రెండవ పారాలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారత మహిళగా నిలిచింది. తరువాత, షూటర్ మనీష్ నర్వాల్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ష్1) ఫైనల్ లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
మరోవైపు, స్ప్రింటర్ ప్రీతి పాల్ మహిళల 100 మీటర్ల ట్35 ఫైనల్ లో కాంస్య పతకాన్ని సాధించి, భారత దేశానికి పారా గేమ్స్ లో మొదటి మెడల్ సాధించిన స్ప్రింటర్ గా రికార్డు నెలకొల్పారు.