మూవీడెస్క్: సెప్టెంబర్ నెలలో రెండు పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. మిగిలినవన్నీ చిన్న చిత్రాలుగానే ఉన్నాయి.
అయితే వాటిలో కొన్ని బజ్ క్రియేట్ చేస్తోన్న మూవీస్ కూడా ఉండటం విశేషం. దాంతో పాటు ప్రస్తుతం మోస్ట్ కాంట్రవర్సీ చిత్రంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కంగనా రనౌత్ ఎమర్జెన్సీ థియేటర్స్ లోకి వస్తోంది.
సెప్టెంబర్ 5న కోలీవుడ్ నుంచి ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన GOAT మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది.
దీని తర్వాత ఆగష్టు 6న నివేదా థామస్ లీడ్ రోల్ లో నటించిన 35 చిన్న కథ కాదు మూవీ రిలీజ్ అవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ లో రానా ఈ చిత్రాన్ని నిర్మించారు.
దాంతో పాటు నారా రోహిత్ సుందరకాండ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా సెప్టెంబర్ 6 ప్రేక్షకుల ముందుకొస్తోంది.
సెప్టెంబర్ 7న సుహాస్ నటించిన జనక అయితే గనక మూవీ రిలీజ్ అవుతోంది. దిల్ రాజు బ్యానర్ నుంచి ఈ చిత్రం వస్తోంది. సినిమా ట్రైలర్ తో కొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.
అలాగే రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమా అదే రోజు థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
రెండో వారంలో సెప్టెంబర్ 13న శ్రీసింహ మత్తు వదలరా 2 మూవీ రిలీజ్ అవుతోంది. అలాగే ధూమ్ ధామ్, ఉత్సవం అనే సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.
అయితే వీటిపై పెద్దగా హైప్ లేదు. మూడో వారంలో ఎలాంటి సినిమా రిలీజ్ కి లేదు. దేవర వైబ్ అప్పటికే స్టార్ట్ అయిపోతుంది.
ఈ నేపథ్యంలో ఎవరు కూడా సినిమాలు రిలీజ్ చేసే సాహసం చేయలేదు. నాలుగో వారంలో సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ అవుతోంది.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది.