fbpx
Wednesday, September 18, 2024
HomeMovie Newsఎన్‌ఎఫ్‌డిసి ఆన్‌లైన్ దేశ‌భ‌క్తి చ‌ల‌న చిత్రోత్స‌వం

ఎన్‌ఎఫ్‌డిసి ఆన్‌లైన్ దేశ‌భ‌క్తి చ‌ల‌న చిత్రోత్స‌వం

OnlinePatrioticFilmFestival By NFDC

ఆన్లైన్ ఫిలిం ఫెస్టివల్: ఈ సంవత్సరం జరిగే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7 వ తేదీ నుండి 21 తేదీ వరకు ఆన్‌లైన్ దేశ‌భ‌క్తి చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డిసి). ఈ సందర్భం గా దేశ భక్తి సినిమాలని స్వాతంత్య్ర పోరాటం నేపధ్య సినిమాలని ప్రదర్శించబోతున్నారు. ఇందులో ప్రదర్శించబోయే సినిమాలన్నీ ఖర్చు లేకుండా అందరూ వీక్షించవచ్చు.

ఇందులో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల ధైర్యాన్ని, వారి పోరాటాన్ని ప్రపంచానికి తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే భావి తరాలకి కూడా ఇలాంటి కథలు వారి పోరాటాలు ఆదర్శంగా నిలుస్తాయి. ఈ ఆన్లైన్ ఫెస్టివల్ లో భాగం గా భారత దేశంలోని వివిధ భాషల్లో ప్రశంసలు పొందిన దేశ భక్తి సినిమాలు ఇందులో భాగం కానున్నాయి. ఇందులో మణి రత్నం ‘రోజా’, సత్యమే వజేయతే, చోటా సిపాయి, సర్దార్ పటేల్, హారూన్ అరుణ్, ఖయామత్, ఖాఖీ(హిందీ), టాంగో చార్లీ, 1971 (మలయాళం), గారే బైరె, గాంధీ, మేకింగ్ అఫ్ మహాత్మా, లెజెండ్ అఫ్ భగత్ సింగ్ .. ఇంకా చాలా సినిమాలు ఉచితంగా ప్రదర్శించబడుతున్నాయి. ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించబోయే సినిమాలని ‘https://www.cinemasofindia.com/’ ఈ వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular