fbpx
Tuesday, April 23, 2024
HomeTop Movie Newsత్వరలో ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్‌!

త్వరలో ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్‌!

ONLINE-MOVIE-BOOKING-PORTAL-BY-ANDHRAPRADESH-GOVERNMENT

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సినిమా థియేటర్ల టికెట్లను ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్ ద్వారా బుక్ చేసుకునేలా‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సినిమా టికెట్లను కూడా రైల్వే టికెట్ల బుకింగ్‌ తరహాలో బుక్ చేసుకోవడం కోసం ఈ ప్రత్యేక పోర్టల్‌ ద్వార అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం.

ఆన్లైన్ లో సినిమా టికెట్ల విక్రయాల విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ విధానాన్ని రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వార నిర్వహించ బడుతుందని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ ‌విశ్వజిత్‌ ఇటీవల దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌ రూపొందించడం మరియు వాటి అమలు తీరుని పర్యవేక్షించడానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించారు. ఈ ప్రత్యేక కమిటీలో ఐటీ శాఖ కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ ప్రతినిధి, ఏపీటీఎస్‌ ఎండీ, కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు మరియు ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular