టాలీవుడ్‌లో ఇప్పుడు సినిమాలు రెండు పార్ట్‌లుగా రావడం సాధారణంగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలకు బిజినెస్ పరంగా లాభదాయకమన్న దృష్టితోనే నిర్మాతలు ఈ ట్రెండ్‌ను అమలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా ఇదే ఫార్మాట్‌లో రూపొందుతుందనే టాక్ వినిపిస్తోంది.
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలను రెండు భాగాలుగా చేసి భారీ వసూళ్లు రాబట్టిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీకి కూడా అదే ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారని, 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని టాక్. దీంతో ఒక్క సినిమాతోనే ఈ పెట్టుబడిని రికవరీ చేయడం కష్టం.
ఇప్పటికే ‘కల్కి 2898 ఏడి’, ‘దేవర’, ‘సలార్’ వంటి సినిమాలు మొదటి భాగం విడుదల చేసిన తర్వాత, రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, కొన్ని సినిమాల్లో మొదటి భాగం అసలు కథను ఎక్కువగా రివీల్ చేయకపోవడం ప్రేక్షకులను నిరాశపరుస్తోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ విషయంలోనూ ఇదే అవుతుందా? లేదా ఒకే భాగంగా విడుదల చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఎలా ప్లాన్ చేస్తుందో వేచి చూడాలి. అయితే, సినిమా మొదటి భాగమే ఆకట్టుకుంటే, రెండో భాగానికి డిమాండ్ పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.