మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న ఐదు భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో కూడా ప్రేక్షకాదరణ పొందుతుండటం విశేషం.
ఈ నేపథ్యంలో దేవర సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది. తారక్ కు కర్ణాటకలో ఉన్న అభిమాన బలం చాలామందికి తెలుసు.
ఎన్టీఆర్ తల్లి కర్ణాటకకు చెందినవారు కావడంతో, అక్కడి ప్రజలు తారక్ ను తమవాడిగా భావిస్తారు. ప్రతి సారి కర్ణాటకకు వెళ్లినప్పుడు ఆయనకు అక్కడి ప్రజలు భారీ స్వాగతం పలుకుతుంటారు.
ఈ అనుబంధం కూడా దేవర సినిమాకు అదనపు బలం చేకూరుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సొంతంగా తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.
భీమ్ పాత్రకు ఆర్ఆర్ఆర్ సినిమాలో 5 గంటల్లోనే కన్నడ డబ్బింగ్ చెప్పిన తారక్, ఇప్పుడు దేవర సినిమా కోసం కేవలం 4 గంటల్లోనే కన్నడ వెర్షన్ పూర్తి చేశారట.
ఈ విషయాన్ని పాటల రచయిత వరదరాజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కన్నడ భాషపై తారక్ కు ఉన్న పట్టును, ఆయా భాషలో ఆయన ఉచ్చారణను వరదరాజ్ ఎంతో ప్రశంసించారు.