మూవీడెస్క్: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు ప్రధాన సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఒకటి రాబిన్ హుడ్, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.
మరొకటి ‘తమ్ముడు’, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ రెండు సినిమాల తర్వాత, నితిన్ టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్‌తో మళ్ళీ కలిసి పనిచేయనున్నారు.
వీరిద్దరి కాంబినేషన్‌లో 2012లో వచ్చిన ఇష్క్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం నితిన్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 80 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు.
మొదట ఈ సినిమా నిర్మాణం బాధ్యతలు నిరంజన్ రెడ్డి తీసుకోనున్నారు. అయితే, నిరంజన్ రెడ్డి ఇటీవల డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేశారు.
ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఏకంగా రూ. 40 కోట్ల వరకు నష్టం వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ సినిమా నిర్మాణం భారంగా మారుతుందని నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట.
దీంతో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి టేకప్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.