fbpx
Wednesday, April 24, 2024
HomeMovie Newsషూటింగ్ ప్రారంభమైన నిఖిల్ '18 పేజెస్'

షూటింగ్ ప్రారంభమైన నిఖిల్ ’18 పేజెస్’

Nikhil 18Pages MovieShootingStarted

టాలీవుడ్: విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తూ తన సినిమా అంటే ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది అని అభిమానులు నమ్మకం పెట్టుకునే స్టేజి కి వెళ్ళాడు హీరో నిఖిల్. మధ్యలో చాలా టైం తీసుకుని అర్జున్ సురవరం సినిమా తీసాడు. అది విడుదల అవడం ఇంకా ఆలస్యం అవడం తో తన కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. అయితే తర్వాత వరుసగా సినిమాలు ఆ గ్యాప్ ని ఫిల్ చేద్దామని రెండు సినిమాలు అంగీకరించిన తర్వాత కరోనా వల్ల వాటికి కూడా బ్రేక్ పడింది. నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ’ అలాగే ’18 పేజెస్’ అనే రెండు సినిమాల్లో నటించనున్నాడు.

నిఖిల్ నటించనున్న ’18 పేజెస్’ సినిమా ఈరోజే షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకున్నట్టు ఈ మధ్యనే అధికారిక ప్రకటన కూడా చేసారు. 18 పేజెస్ సినిమాని GA2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఈ సినిమాకి కథ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇదే ఈ సినిమాకి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాకి దర్శకత్వం వహించిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular