మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన అభిమానులకు సినీ ప్రపంచం నుంచి వచ్చే అప్‌డేట్స్ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ రగిలే రివెంజ్ మోడ్‌లో కనిపిస్తున్న పోస్టర్ విడుదల తర్వాత, ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇందులో పవన్ ఒక పాట పాడబోతున్నారనే వార్తలు అభిమానుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. గతంలో ‘జానీ’ మరియు ‘అత్తారింటికి దారేది’ చిత్రాల్లో పవన్ పాటలు పాడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరోసారి తన గాత్రంతో అభిమానులను అలరించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఓజీ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందనీ, సెప్టెంబర్ మూడో వారం నుంచి చిత్రీకరణ మళ్ళీ ప్రారంభమవుతుందనే సమాచారంతో సినిమా టీమ్ ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రాన్ని 2025 వేసవి రంజాన్ సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నారు, ఇది పవన్ అభిమానులకు గొప్ప కబురుగా చెప్పుకోవచ్చు.
అలాగే సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ టీమ్ నుండి పెద్ద అప్డేట్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. మరి ఆ అప్డేట్ సినిమాపై ఇంకా ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.