fbpx
Tuesday, April 23, 2024
HomeMovie Newsనాయన తార 'నేత్రికన్' ట్రైలర్

నాయన తార ‘నేత్రికన్’ ట్రైలర్

Nayanatara Netrikan Trailer

కోలీవుడ్: తమిళ్ లో లేడీ ఓరియెంటెడ్ పాత్రలకి నయనతార మంచి చాయిస్ అని తన నుండి వస్తున్న సినిమాలు చూస్తే తెలుస్తుంది. అంతే కాకుండా మూడు భాషల్లో నయనతార కి ఉన్న ఫాలోయింగ్ కూడా నయనతార కి కలిసొచ్చే అంశం. కమర్షియల్ సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా తనలోని నటనని నిరూపించుకునే పాత్రలు చేస్తుంది నయనతార.

‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమాలో చెవిటి పాత్రలో నటించి మెప్పించిన నయనతార ప్రస్తుతం ‘నేత్రికన్’ అనే సినిమాలో దృష్టి లోపం ఉన్న పాత్రలో నటిస్తుంది. నయనతార నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఒక పూర్తి క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. ఒక ఆక్సిడెంట్ కి విట్నెస్ గా నయనతార ఆ ఆక్సిడెంట్ చేసిన కిడ్నాపర్ తో ఫైట్ కొనసాగిస్తుంది. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపే సైకో విలన్ , దృష్టి లోపం ఉన్న నయనతార మధ్య ఫైట్ ఆసక్తి కరంగా ఉండబోతున్నట్టు ట్రైలర్ లో చూపించారు. తన ముందు జరిగిన రోడ్ ఆక్సిడెంట్ ని ప్రూవ్ చేయడానికి అలాగే ఈ సైకో కిల్లర్ బారిన పడకుండా తనని తాను ఎలా రక్షించుకుంది ఆసక్తి కరంగా ఉండబోతుందని తెలుస్తుంది.

సీనియర్ హీరోయిన్ నయనతార ఈ చాలెంజింగ్ పాత్ర చేస్తుండగా రంగం సినిమా లో విలన్ గా నటించిన అజ్మల్ అమీర్ ఈ సైకో కిల్లర్ పాత్రలో నటించాడు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విగ్నేష్ శివన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మిలింద్ రావు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగష్టు 13 న ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం భాషల్లో హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular