fbpx
Friday, March 29, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsనాగ శౌర్య 'లక్ష్య' టైటిల్ పోస్టర్

నాగ శౌర్య ‘లక్ష్య’ టైటిల్ పోస్టర్

Nagashourya Lakshya TitlePoster

టాలీవుడ్: వరుస సినిమాలతో బిజీ గా ఉన్న నాగ శౌర్య ప్రస్తుతం స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా కథ పైన ఒక సినిమా చేస్తున్నాడు. తన 20 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇవాల విడుదల చేసారు. ఇదివరకే విడుదల చేసిన ప్రీ లుక్ లో నాగ శౌర్య కొత్త లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇవాల విడుదల చేసిన టైటిల్ పోస్టర్ తో ఈ సినిమా పైన అంచనాలు భారీ గా పెంచేసాడు. ఈ సినిమాలో ఒక విలుకారుడిగా నాగ శౌర్య నటిస్తున్నాడు. ఒక మంచి అథ్లెట్ ఎలా ఉంటాడో నాగ శౌర్య ఈ సినిమా కోసం ఆ రూపం లోకి మారిపోయాడు.

ఏషియన్ మూవీస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కలర్ ఫోటో కి సంగీతం అందించి మంచి సక్సెస్ అందుకున్న కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాతో మరో మంచి అవకాశం సంపాదించాడు. ఈ సినిమాలో శౌర్య కి జోడీ గా కేతిక శర్మ నటిస్తుంది. ఆర్చరీ గేమ్ పైన ఇండియా లో తీసే మొదటి సినిమా గా ఈ సినిమా తెరకెక్కుతుంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా 2021 ప్రథమార్థం లో విడుదలకి సిద్ధం అవబోతుంది. ఈ సినిమాతో పాటు శౌర్య అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా , లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో మరొక ఫామిలీ ఎంటర్టైనర్ లో ఒకే సారి మూడు సినిమాలని సిద్ధం చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular