fbpx
Sunday, April 20, 2025
HomeBig Storyతండేల్ - మూవీ రివ్యూ & రేటింగ్

తండేల్ – మూవీ రివ్యూ & రేటింగ్

Thandel-movie-review-rating

తండేల్ కథ:

శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు (నాగచైతన్య) సముద్రంలో చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తాడు. అతని ప్రాణం సత్య (సాయి పల్లవి).

చిన్నతనం నుంచి ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతుంటారు. కానీ అనుకోని పరిణామాల్లో భాగంగా రాజు పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ చేతిలో చిక్కుకుంటాడు.

ఓ పరాయి దేశంలో జైలుపాలైన రాజు కోసం సత్య ఎంతలా బాధపడింది? చివరకు రాజు తిరిగి వచ్చి సత్యతో ఒక్కటయ్యాడా? లేదా? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:

తండేల్ సినిమాకు ప్రధాన బలం బలమైన ఎమోషన్స్. రాజు, సత్య మధ్య కెమిస్ట్రీ, వారి ప్రేమలోని బాధను దర్శకుడు చందూ మొండేటి అద్భుతంగా చిత్రీకరించాడు.

నాగచైతన్య పాత్రలో ఒదిగిపోతూ, ప్రేమికుడిగా తనలోని మెచ్యూరిటీని చూపించాడు. 

మరోవైపు, సాయి పల్లవి తాను ఎదుర్కొనే బాధను కళ్ల ద్వారా భావితరం చేస్తూ ప్రేక్షకులను కదిలించింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్‌గా హైలైట్ అయ్యింది. 

సాంకేతికంగా చూస్తే, షామ్ దత్ సినిమాటోగ్రఫీ ద్వారా తీరప్రాంతం అందాలను ఆకర్షణీయంగా చూపించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు అదనపు బలం ఇచ్చింది.

ముఖ్యంగా సాయి పల్లవి పై వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగా హైలెట్ అయ్యింది.

అయితే ఫస్ట్ హాఫ్ లో  అక్కడక్కడా ల్యాగ్ సీన్స్ లెంగ్త్ ను తగ్గించి ఉంటే బాగుండేది.

ప్రధానంగా చైతు, సాయి పల్లవి నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. డైరెక్టర్ చందూ రచన దర్శకత్వం కూడా మెప్పించాయి.

ఫైనల్ గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

ప్లస్ పాయింట్స్:

-నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ

-హృదయాన్ని కదిలించే ఎమోషనల్ సన్నివేశాలు

-దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నేపథ్య సంగీతం

-తీరప్రాంత జీవనశైలిని ప్రతిబింబించిన విజువల్స్

మైనస్ పాయింట్స్:

-స్క్రీన్‌ప్లేలో కొన్ని చోట్ల లాగ్

-కొన్ని సన్నివేశాలు రొటీన్ అనిపించే విధంగా సాగడం

రేటింగ్: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular