అమరావతి: జగన్‌పై మండిపడ్డ నాదెండ్ల మనోహర్!
జగన్ వ్యాఖ్యలకు నాదెండ్ల స్ట్రాంగ్ కౌంటర్
జనసేన (JanaSena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తీవ్రంగా స్పందించారు.
జగన్ అసలేమన్నారు?
జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ “కార్పొరేటర్ కు ఎక్కువ, ఏమ్మేల్లెకు తక్కువ” అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో, “వై నాట్ 175” (Why Not 175) అంటూ ఎన్నికల ముందు విర్రవీగిన జగన్, కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారని దీంతో మతి చలించిందని మనోహర్ ఎద్దేవా చేశారు. ఓటమి తట్టుకోలేక జగన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
జర్మనీ చట్టాలు ఏపీలో ఎలా?
జగన్ పాలనపై ఘాటు విమర్శలు చేస్తూ, “జర్మనీ (Germany) చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటారు, అది ఎలా సాధ్యం?” అని మనోహర్ ప్రశ్నించారు. పార్టీకి సరైన బలం లేకపోవడం వల్లే జగన్ తనను తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారని విమర్శించారు.
“ఒక్క రూపాయి అయినా ప్రజలకు దానం చేశారా?” అంటూ జగన్‌ను ప్రశ్నించిన ఆయన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేలాదిమందికి ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు.
పట్టభద్రుల తీర్పు సుస్పష్టం
నిన్నటి పట్టభద్రుల (Graduate) ఎన్నికల్లో యువత ఇచ్చిన తీర్పు జగన్‌కు గుణపాఠమని మనోహర్ పేర్కొన్నారు. “సూపర్ 6” (Super 6) గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని, ప్రజాస్వామ్యంలో మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో జగన్ తెలుసుకోవాలని సూచించారు.
వైసీపీ హయాంలో రైతులకు (Farmers) ధాన్యం కొనుగోలు తో సహా అనేక పథకాలకు బకాయిలు మిగిలిపోవడం, అనేక ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగించడాన్ని మనోహర్ తప్పుబట్టారు.
“కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ”
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు “వర్క్ ఫ్రమ్ హోమ్” (Work from Home CM) ముద్రపడిన జగన్, ఇప్పుడు “వర్క్ ఫ్రమ్ బెంగుళూరు” (Work from Bengaluru) ఎమ్మెల్యేగా మారారని మనోహర్ సెటైర్లు వేశారు.
జగన్ గురించి మాట్లాడేటప్పుడు తాముకూడా “జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ” అని సంబోదించగలమనీ కానీ మర్యాదా, పరిమితులు పాటిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని మనోహర్ ప్రకటించారు.