టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి సక్సెస్ లతో ఆశ్చర్య పరిచింది. ఏప్రిల్ 10న ఒకేరోజు రెండు సినిమాలను రిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది.
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మరియు బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్ సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇప్పటి వరకు రూ.152 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అజిత్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ 150 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది.
మరోవైపు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రూపొందిన జాట్ మూవీ సన్నీ డియోల్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టే ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది.
ఇక ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ చేసి, రెండింటినీ హిట్ చేయడం చాలా అరుదైన విషయం. అయితే మైత్రీ సంస్థ ఆ రిస్క్‌నే కాదు.. రివార్డునీ అందుకుంది. బిజినెస్ పరంగా, ప్రొడక్షన్ పరంగా సరికొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది.