జాతీయం: ముడా కేసు షాక్: సీఎం సిద్ధరామయ్య దంపతులకు నోటీసులు
భూకేటాయింపుల్లో అక్రమాలపై హైకోర్టు స్పందన
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల కేటాయింపుల వ్యవహారంలో వచ్చిన అవకతవల ఆరోపణలపై కర్ణాటక హైకోర్టు కీలక చర్య చేపట్టింది. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన సతీమణి బీఎమ్ పార్వతికు నోటీసులు జారీ చేసింది.
ముడా కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్
MUDA కేసును CBI కి బదిలీ చేయాలంటూ ఇటీవల దాఖలైన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, నోటీసులు పంపిస్తూ తమ వాదనలు గడువులోగా సమర్పించాలని ఆదేశించింది. గతంలో ఇదే కేసును లోకాయుక్త దర్యాప్తు చట్టబద్ధమేనంటూ కోర్టు తిరస్కరించినా, తాజాగా మళ్లీ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది.
భూకేటాయింపుల్లో అధిక విలువపై అనుమానాలు
MUDA భూముల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి కుటుంబానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. బీఎమ్ పార్వతి పేరిట కేటాయించిన ప్రత్యామ్నాయ స్థలాల విలువ, అసలు భూముల విలువ కంటే ఎక్కువగా ఉన్నదని దాఖలైన పిటిషన్ పేర్కొంది.
అధికార దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు
సిద్ధరామయ్య తన పదవిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ముఖ్యంగా ఆయన కుటుంబసభ్యులకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారన్న వాదన రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.