fbpx
Saturday, April 20, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsశ్రీదేవి సోడా సెంటర్- మెలోడీ తో ఆకట్టుకున్న మణి శర్మ

శ్రీదేవి సోడా సెంటర్- మెలోడీ తో ఆకట్టుకున్న మణి శర్మ

MelodySong From Manisharma

టాలీవుడ్: సూపర్ స్టార్ కృష్ణ ఫామిలీ నుండి హీరో గా వచ్చిన సుధీర్ బాబు ప్రస్తుతం ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మొదటి నుండి ఎంతో కష్టపడుతున్న ఈ నటుడు హీరో గా బాగానే ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన విజయాలు రావట్లేదు. సినిమాల పరంగా కూడా మంచి ప్రయోగాలే చేస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు. ‘పలాస 1978 ‘ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ రోజు ఈ సినిమా నుండి నాలో మొదలైంది అనే పాట విడుదల చేసారు.

మణి శర్మ సంగీతం లో రూపొందిన ఈ పాట మెలోడియస్ ట్యూన్ తో ఆకట్టుకుంది. మెలోడీ బ్రహ్మ గా పేరు పొందిన మణి శర్మ తన పాత రోజుల్ని గుర్తుకు తెచ్చాడు. దాదాపు 15 -20 సంవత్సరాలు తన ట్యూన్స్ తో తెలుగు సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించిన మణి శర్మ మరో సారి హిట్ ట్రాక్ లో పడ్డాడు. ఈ పాటతో మరో సారి పాత రోజుల్ని గుర్తుకు తెచ్చాడు. ఈ పాట లిరికల్ వీడియో లో కూడా ఎక్సప్రెషన్స్ పరంగా, విజువల్స్ పరంగా బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో సుధీర్ కి జోడీ గా తెలుగు అమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్ట్రీ రచనతో రమ్య బెహరా ఈ పాటని ఆలపించారు. 70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చల్లా, శశి దేవి రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా విడుదల అప్ డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular