మూవీడెస్క్:మెగాస్టార్ చిరంజీవి తన నటనతోనే కాకుండా, కష్టపడే స్ఫూర్తితో కూడా టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
సినిమాల్లోనే కాదు, సినిమా షూటింగ్స్ విషయంలోను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.
ఇక ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఇంద్ర సినిమాలోని కొంత భాగానికి ఆయన డైరెక్ట్ చేశారట. ఆ విషయం గురించి ఇటీవల నటుడు రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
దర్శకుడు బి. గోపాల్ మరో సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్‌లో పాటల చిత్రీకరణలో ఉండగా, చిరంజీవి కీలక సన్నివేశాలను స్వయంగా తెరకెక్కించారని అన్నాడు.
ముఖ్యంగా, యజ్ఞం, వర్షం సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వేసవిలో, కఠిన పరిస్థితుల్లో కూడా ఆయన 28 రోజుల పాటు కష్టపడుతూ ఆ సీన్లు పూర్తి చేయడంపై షూటింగ్ టీమ్ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసిందని రాజా రవీంద్ర వివరణ ఇచ్చారు.
జూనియర్ ఆర్టిస్టులు కూడా చిరంజీవి ఎంత దయతో వారిని ఆదరించారో గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ, చిరంజీవి ఈ సక్సెస్‌లో తన దర్శక ప్రతిభను ఎప్పుడూ ప్రచారం చేయలేదు.
ఈ ఘటనతో మెగాస్టార్‌కి ఉన్న డెడికేషన్ లెవెల్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర చిత్రాన్ని ఆగష్టు 22వ తేదీన రీరిలీజ్ చేయనున్నారు.