ఈ ఏడాది మార్చి నెలలో తెలుగు సినిమా రంగం బిగ్ ఫెస్ట్‌కు సిద్ధమవుతోంది. పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఏ సినిమా హిట్ టాక్ అందుకున్నా భారీ లాభాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా, విడుదల తేదీల మధ్య కొంత గ్యాప్ ఉండటంతో సినిమాలు బాగుంటే వసూళ్ల పరంగా మంచి రన్ ఇచ్చేలా ఉన్నాయి.
మహిళా దినోత్సవం ముందు రోజు మార్చి 7న నారి: ది విమెన్, జిగేల్, ఛావా వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వీటితో పాటు జీవీ ప్రకాశ్ నటించిన కింగ్‌స్టన్, మలయాళం నుండి అనువాదమైన ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే రోజున విడుదల కానున్నాయి.
మార్చి 14న ప్రియదర్శి, హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో కోర్ట్ సినిమా విడుదల అవుతుంది. అదేరోజు కిరణ్ అబ్బవరం దిల్ రూబా, జాన్ అబ్రహాం ది డిప్లొమాట్ కూడా థియేటర్లలోకి రానున్నాయి.
మార్చి 27న విక్రమ్ వీర ధీర శూరన్ 2, మోహన్ లాల్ ఎల్ 2: ఎంపురాన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మార్చి 28న నితిన్ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు విడుదల కానుండగా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పార్ట్ 1 వాయిదా పడే అవకాశముందని టాక్.
ఈసారి మార్చి రీలీజుల లైనప్ చూస్తే హిట్ టాక్ దక్కించుకున్న సినిమాలకు మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది. మరి ఏవీ హిట్ అవుతాయో చూడాలి!