fbpx
HomeTelanganaఏపీ, టీఎస్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల!

ఏపీ, టీఎస్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల!

LOCALBODY-QUOTA-MLC-ELECTION-RELEASED-FOR-AP-TELANGANA

అమరావతి: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ఇవాళ విడుదలైంది. 9వ తేదీ 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ షెడ్యూల్‌ విడుదల జరిగింది. అనంతపురం-1, కృష్ణా-2, తూర్పుగోదావరి-1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్‌ ఇవాళ ప్రకటించారు.

ఈ ఎన్నికలకు నవంబర్‌ 16వ తేదీన నోటిఫికేషన్‌ మరియు డిసెంబర్‌ 10న పోలింగ్‌ తరువాత డిసెంబర్ 14వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది. తెలంగాణ రాష్ట్రం లో కూడా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించారు.

నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular