ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి 26న గుండెపోటు రావడంతో విజయవాడలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయనను కుటుంబసభ్యులు చేర్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా ఏఐజీ ఆసుపత్రి వైద్యులు నానిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మూడు వాల్వులు పూర్తిగా మూసుకుపోయాయని, స్టంట్‌లతో మెరుగుదల సాధ్యం కాకపోతే బైపాస్ సర్జరీ తప్పదని వివరించారు.
అత్యుత్తమ వైద్యసదుపాయాల కోసం ఆయనను ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
చికిత్స అనంతరం కొడాలి నానిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. త్వరితగతిన మానసిక, శారీరక విశ్రాంతి అవసరమని సూచించారు.