స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్స్టన్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇండియన్ సినిమాల్లోనే మొట్టమొదటిసారిగా సముద్రపు లోతుల్లో మిస్టరీని చూపించే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందింది. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో, ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
ట్రైలర్‌ను చూస్తే, ఓ కోస్టల్ విలేజ్‌లో ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నట్లు చూపించారు. గ్రామస్థుల జీవితాల్లో ఓ తెలియని మిస్టరీ ఉందని, అందుకు సముద్రం కీలక పాత్ర పోషిస్తోందని హింట్ ఇచ్చారు. జీవీ ప్రకాష్ క్యారెక్టర్ ఆసక్తిని రేపుతోంది.
విజువల్స్ హై స్టాండర్డ్‌గా ఉండటంతో పాటు, జీవీ ప్రకాష్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సముద్రపు లోతుల్లో ఉన్న రహస్యాన్ని కింగ్స్టన్ ఎలా ఛేదిస్తాడు? అసలు అక్కడ ఏముంది? అన్నది సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.
ఈ సినిమా జీ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. మర్చి 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మెరైన్ అడ్వెంచర్ నేపథ్యంతో ఇలాంటి కథ భారతీయ సినిమాల్లో తొలిసారి రావడంతో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.