బాలీవుడ్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ ‘గుంజన్ సక్సేనా’ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా ‘గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్’. ఈ సినిమాలో ‘గుంజన్ సక్సేనా’ క్యారెక్టర్ లో శ్రీదేవి కూతురు ‘జాన్వీ కపూర్’ నటించింది. భారత దేశపు తొలి మహిళా పైలట్, తాను పైలట్ గా ప్రయాణం ప్రారంభించిన రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన విధానం తాను సాధించిన విజయాల ఆధారంగా రూపొందించిన సినిమా. ఈ సినిమాని కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోపిక్ ని ఆగష్టు 12న డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ప్లిక్స్ లో విడుదల చెయ్యబోతున్నారు.
ట్రైలర్ ఆరంభం లోనే ఎయిర్ ఫోర్స్ లో అందర్నీ సమానంగా చూస్తారని, ప్రస్తుతం 1625 లేడీ ఆఫీసర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తున్నారని ట్రైలర్ ఆరంభం లో చెప్పారు. ‘నువ్వు ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలంటే సోల్జర్ గా మారాలి.. లేకపోతే తిరిగి వంటగదికి వెళ్లిపోండి’ అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. చిన్నప్పటి నుండి తనకి పైలట్ అవ్వాలనే ఆశ ఎలా ఉందొ, దాన్ని ఎలా సాధించిందో, సాధించిన తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనే సీన్స్ తో , మధ్యలో వచ్చే ఆసక్తి కరమైన సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. జాన్వీ కపూర్ తో పాటు పంకజ్ త్రిపాఠి మరో అద్భుతమైన పాత్ర పోషించాడు. ట్రైలర్ చూసి జాన్వీ పాత్ర నటన ఊహించడం చెప్పడం కష్టమే కానీ రెండవ సినిమాకే బలమైన పాత్ర ఎలా పోషించిందో సినిమా వచ్చాకే తెలుస్తుంది. ఈ చిత్రానికి అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్ గా నటించారు. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 12 న విడుదల చెయ్యబోతున్నారు.
maroka nepotism cinema. story manchide aina, valle untaru.