మూవీడెస్క్:సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల కేసులో తాజా పరిణామాలు చర్చకు దారి తీస్తున్నాయి.
నార్సింగి పోలీసులు ఆయనను నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకోవడానికి కోర్టు అనుమతినిచ్చింది.
రిమాండ్‌లో ఉన్న జానీ మాస్టర్‌పై అభియోగాలు సీరియస్ గా మారడంతో, పోలీసులు మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.
నాలుగు సంవత్సరాలుగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని బాధితురాలు చేసిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ విచారణను కస్టడీ ద్వారా కొనసాగించాలని నిర్ణయించారు.
అలాగే కస్టడీకి అనుమతి ఇవ్వడంతో పోలీసుల విచారణ కీలక మలుపు తీసుకురాబోతోందని తెలుస్తోంది.
జానీ మాస్టర్‌పై కేసు నమోదైన సమయంలో ఆయన పరారీలో ఉండగా, గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించడంతో ఈ కేసు మరింతగా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఆయనపై పోక్సో చట్టం, సెక్షన్ 376 వంటి తీవ్ర నేరాల కింద కేసులు నమోదయ్యాయి.
ఇప్పుడు కస్టడీ విచారణలో ఎలాంటి కీలక ఆధారాలు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది.
విచారణ సవ్యంగా జరిగితే ఈ కేసులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.