మూవీడెస్క్: మాచో హీరో గోపీచంద్ తన మాస్ ఇమేజ్‌తో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్నా, ఇటీవల కాలంలో సరైన హిట్ లేక పోవడం వల్ల మార్కెట్‌లో తన స్థానాన్ని కొంత కోల్పోయాడు.
వరుసగా వస్తున్న ఫ్లాప్‌లు అభిమానులను నిరాశపరిచాయి. సరైన డైరెక్టర్ దొరకకపోవడం కూడా ఓ కారణం.
అయితే అక్టోబర్ 11న విడుదల కాబోతున్న విశ్వం ట్రైలర్ చూస్తుంటే, మళ్లీ అంచనాలు పెరుగుతున్నాయి.
దర్శకుడు శ్రీను వైట్ల తనదైన స్టైల్ కామెడీ, యాక్షన్ మిక్స్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది.
ఈ చిత్రం హిట్ అయితే గోపీచంద్‌కి, శ్రీను వైట్లకు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా, బాలకృష్ణ – బోయపాటి శీను కాంబినేషన్‌లో రాబోయే ప్యాన్ ఇండియా సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఈ ఆలోచన ప్రతిపాదన దశలోనే ఉంది. కథ ఇంకా పూర్తి స్థాయిలో నెరేట్ కాలేదు. వర‍్షం, జయం చిత్రాల్లో గోపీచంద్ విలన్ పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోవడంతో, మళ్లీ ఆయనలోని విలన్ పర్వాలేదు అని టాక్ వినిపిస్తోంది.
నిజం చిత్రం పెద్దగా ఆడకపోయినా, గోపీచంద్ నటన ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది.
అఖండ 2గా ప్రచారంలో ఉన్న బాలయ్య, బోయపాటి చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. మరి గోపీచంద్ ఈ ప్రతిష్ఠాత్మక సినిమాలో విలన్‌గా కనిపిస్తాడా? లేదా వేచి చూడాలి.