చెన్నై: India vs Bangladesh: తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగవ రోజు ఆట మొదలైన కాసేపటికే భారత్ గెలిచింది.
బంగ్లాదేశ్ ను 234 పరుగులకే ఆలౌట్ చేసి 280 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. బ్యాటింగ్ లో సెంచరీ సాధించిన అశ్విన్ బౌలింగ్ లో 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు.
బ్యాటింగ్ బౌలింగ్ లో అధ్బుత ప్రదర్శనకు గాను రవిచంద్రన్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ద్ మ్యాచ్ అవార్డు వరించింది.
తొలి టెస్టు భారీ విజయాన్ని సాధించిన భారత్ సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించగా, రెండవ టెస్టు 27వ తేదీన ప్రారంభం కానుంది.