చెన్నై: చెన్నై చెపాక్ స్టేడియం లో ఇండియా బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు.
ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 50/3 మాత్రమే ఉంది. క్రీజ్ లో యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ ఉన్నారు.