కాన్పూర్: కాన్పూర్ టెస్టులో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ రికార్డును చెరిపేసిన టీమిండియా.
నాలుగో రోజు ప్రారంభంలోనే బంగ్లాదేశ్‌ను 233 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు, తర్వాతి ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 50 పరుగుల మైలురాయిని అధిగమించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ చెలరేగడంతో కేవలం 18 బంతుల్లోనే టీమిండియా 50 పరుగుల మార్క్‌ను చేరుకుంది.
గతంలో ఈ రికార్డు 26 బంతుల్లో 50 పరుగులు ఇంగ్లండ్ పేరిట ఉండేది. ఇప్పుడు భారత జట్టు ఆ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించింది.
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జోడీ మొదటి వికెట్‌కు 55 పరుగులు జత చేసింది. రోహిత్ శర్మ 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 23 పరుగులు సాధించి మిరాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ప్రస్తుతం, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో 5 వికెట్ నష్టానికి 264 పరుగులతో ఆడుతోంది చేసింది. కోహ్లీ 47 పరుగుల దగ్గర అవుటయ్యి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నారు.
కేఎల్ రాహుల్ 65 దగ్గర, జడేజా 4 పరుగుల దగ్గర ఆడుతున్నారు.