మూవీడెస్క్: సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వీ కి ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక పెద్ద ఛాన్స్ లభించింది.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఆమె ప్రధాన కథానాయికగా ఎంపికైంది.
ఇంతకుముందు యూట్యూబ్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇమాన్వీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రత్యేకించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 8 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
కానీ ప్రభాస్‌తో నటించే అవకాశం రావడం ఆమెకు చరిత్రాత్మక ఛాన్స్ అని చెప్పాలి. ఒకప్పుడు కత్రినా కైఫ్‌కు ‘మల్లీశ్వరి’ సినిమాలో అవకాశం వచ్చినట్లు ఇప్పుడు ఇమాన్వీ కూడా టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించబోతుంది.
అంతేకాకుండా, ఈ సినిమాలో నటించడానికి ఆమెకు భారీ రెమ్యునరేషన్ లభించిందని సమాచారం. పలు రిపోర్టుల ప్రకారం, ఆమెకు 1 కోటి రూపాయల వరకు పారితోషకం అందుతుందట.
ఒక కొత్త నటీమణి ఈ స్థాయి రెమ్యునరేషన్ పొందడం ఇమాన్వీ సోషల్ మీడియా క్రేజ్‌కు సంబంధించినదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభాస్ సరసన నటించడం ద్వారా ఇమాన్వీకి టాలీవుడ్‌లో పెద్ద నిర్మాతలు, దర్శకులు అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక ఆమె కెరీర్ దిశలో ఈ చిత్రం కీలకంగా మారే అవకాశం ఉంది. కానీ ఇమాన్వీ భవిష్యత్‌లో తన సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా, మంచి కథలు, పాత్రలను ఎంచుకుంటే ఆమెకు సుదీర్ఘంగా ఇండస్ట్రీలో ఉండే అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.