మైత్రీ అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై మ్యూజిక్ దిగ్గజం ఇళయరాజా పంపిన నోటీసులు ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఈ సినిమాలో తన పాత పాటలు అనుమతి లేకుండా వాడినట్లు ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు.
తన కాపీరైట్ ఉల్లంఘన జరిగిందని, పాటల వినియోగాన్ని తక్షణం నిలిపివేయాలని, రూ.5 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు. దీనిపై నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.
నిర్మాత నవీన్ మాట్లాడుతూ – “మేము అన్ని లేబల్స్ నుండి పాటల రైట్స్‌ను అధికారికంగా పొందాం. అవసరమైన ఎన్ఓసీలు కూడా తీసుకున్నాం. చట్టబద్ధంగా పాటల వినియోగం జరిగింది. ఇలాంటి విషయాల్లో మేము ఎప్పుడూ ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తాం” అని చెప్పారు.
ఇళయరాజా గతంలోనూ పలు సందర్భాల్లో తన పాటల విషయంలో శాటిల్ కాకుండా నేరుగా లీగల్ మార్గం ఎంచుకున్న సంగతి తెలిసిందే. కానీ లేబల్స్.. కంపోజర్ మధ్య కాంట్రాక్టులు ఈ వివాదంలో కీలకంగా మారే అవకాశముంది.
ప్రస్తుతం ఈ వివాదం సినిమా రన్‌పై ప్రభావం చూపించకపోయినా, ఇళయరాజా తదుపరి స్పందన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.